లాభదాయక పంటలపై రైతులకు అవగాహన: ఎమ్మెల్యే

లాభదాయక పంటలపై రైతులకు అవగాహన: ఎమ్మెల్యే

E.G: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు చేపడుతోందని MLA మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు. నల్లజర్లలో 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో రైతులతో మమేకమై వారి వివరాలు సేకరిస్తారన్నారు. కేవలం సాగుకే పరిమితం కాకుండా నూతన లాభదాయక పంటల వైపు రైతులు మళ్లేలా అవగాహన కల్పిస్తామన్నారు.