ఉత్తమ జర్నలిస్ట్‌గా మాధవరావు
SKLM: మెలియాపుట్టి మండలం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గేదెల మాధవరావుకి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు- 2025ను మోటూరు హనుమంతరావు(ఎం.హెచ్) ప్రకటించారు. ఆయన గిరిజన గ్రామాల సమస్యలపై తనదైన కథనాలు రాసినందుకు గాను ప్రజాశక్తి సాహిత్య సంస్థ ఈ అవార్డు ప్రధానం చేసింది. ఈ అవార్డును గుంటూరులో ఆగస్టు 1వ తేదీన ఆయనకు ప్రధానం చేస్తారు. దీంతో రిపోర్టర్‌కు పాత్రికేయులు అభినందనలు తెలిపారు.