మూలకోన వెళ్లే వారికి ముఖ్య గమనిక

మూలకోన వెళ్లే వారికి ముఖ్య గమనిక

TPT: పుత్తూరు సమీపంలోని మూలకోనను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు బ్యానర్లు ఏర్పాటు చేశారు. మరమ్మతుల కారణంగా పర్యాటకులను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. వేసవి కాలంలో అత్యధికంగా వచ్చే పర్యాటకులు ఈ విషయాన్ని గుర్తించి, అటవీశాఖకు సహకరించాలని కోరారు. మరమ్మతులు పూర్తి చేసి త్వరలో పర్యాటకులను అనుమతిస్తామని తెలిపారు.