రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్

రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్

KDP: జమ్మలమడుగు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు, పాత నేరస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో CI నరేష్ ఈ కార్యక్రమం చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్, బైండోవర్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరప్రవర్తనకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు.