కశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి నిందితుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దచిగామ్, కుల్గామ్, షోపియాన్, అనంతనాగ్, పహల్గామ్ చుట్టుపక్కల అడవుల్లో విస్తృతంగా గాలిస్తున్నాయి. డ్రోన్లు, త్రీడీ మ్యాపింగ్ సాయంతో ఉగ్రవేటను సాగిస్తున్నాయి.