రాష్ట్రస్థాయి కబడ్డీకి ఆమనగల్లు యువకుడి ఎంపిక

రాష్ట్రస్థాయి కబడ్డీకి ఆమనగల్లు యువకుడి ఎంపిక

RR: ఆమనగల్లు మండలం శంకర్‌కొండ పరిధిలోని దయ్యాలబోడు తండాకు చెందిన ఎన్. సాయి అండర్-17 జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. మధ్యప్రదేశ్‌లో జరిగే పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన సాయిని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు, తండావాసులు అభినందించారు. క్రీడారంగంలో పాఠశాల పేరును నిలిపినందుకు హర్షం వ్యక్తం చేశారు.