మాస్ కాపీయింగ్.. 22 విద్యార్థులు డిబార్

WGL: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సోమవారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ 22 మంది విద్యార్థులు పట్టుబడినట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 12 మంది, ఆదిలాబాద్‌లో ఐదుగురు, ఖమ్మంలో ఐదుగురు విద్యార్థులు చిట్టీలు రాస్తూ పట్టుబడగా వారిని డిబార్ చేసినట్లు చెప్పారు.