VIDEO: గాజుల్ పాడ్‌లో పశువులకు గాలికుంటు టీకాలు
SRD: కంగ్టి మండలంలోని గాజుల్ పాడ్ గ్రామంలో సోమవారం పశువులకు ఎఫ్ఎండీ టీకాలు వేసినట్లు గోపాల మిత్ర రాజేందర్ రావు పాటిల్ తెలిపారు. సర్పంచ్ భీమ్రావు పాటిల్ టీకాల కార్యక్రమం ప్రారంభించగా.. దాదాపు 60 పశువులకు టీకాలు వేసినట్లు రాజేందర్రావు తెలిపారు. వేసవిలో పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధుల నివారణకు టీకాలు వేయించుకోవడం తప్పనిసరని తెలిపారు.