రేషన్ దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు

రేషన్ దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు

PLD: నకరికల్లులోని 2, 3, 4 నంబర్‌ల రేషన్ దుకాణాల్లో తహశీల్దార్ పుల్లారావు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. రేషన్ షాపుల వద్ద ధరల పట్టిక, స్టాక్ బోర్డులు పెట్టాలని ఆయన డీలర్లకు సూచించారు. వృద్ధులు, వికలాంగులకు ఇళ్ల వద్దనే రేషన్ అందజేయాలని చెప్పారు. రికార్డులు ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలని, ఎటువంటి అవకతవకలు జరిగినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.