అప్పుడు టీచర్‌గా.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్‌గా

అప్పుడు టీచర్‌గా.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్‌గా

శ్రీకాకుళం: ఇచ్చాపురం సమీపంలోని పాలవలస గ్రామంలో ఆదివారం డిప్యూటీ కలెక్టర్ వేణుగోపాల్ పర్యటించారు. 2001లో ఇదే గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన, ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ హోదాలో గ్రామానికి వచ్చి, తన పాత పాఠశాల అనుభవాలను గ్రామస్తులతో పంచుకున్నారు. పాఠశాలలకు అవసరమైన వసతులను ప్రభుత్వం తరపున అందేలా కృషి చేస్తామన్నారు.