రేపటితో ముగియనున్న సర్పంచుల పాలన

రేపటితో ముగియనున్న సర్పంచుల పాలన

రేపటి నుంచి గ్రామాల్లో సర్పంచుల పాలన ముగియనుంది. వారి స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లాలోని 700 పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కలెక్టర్ హిమాన్షు శుక్లా విడుదల చేశారు. అధికారుల జాబితాను మండలాలకు పంపారు. పంచాయతీ ఎన్నికలు పూర్తై, కొత్త సర్పంచులు వచ్చే వరకు వీరు బాధ్యతలు వహిస్తారు.