పారిశుద్ధ్యం పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి: కమిషనర్
NLR: శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి రథోత్సవం సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య పనులపై కమిషనర్ వై.ఓ. నందన్ దృష్టి సారించారు. బుధవారం క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్నప్రసాదం పంపిణీ కేంద్రాల వద్ద ప్రత్యేక డస్ట్ బిన్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మాడ వీధుల్లో బ్లీచింగ్, ఫాగింగ్ పనులు నిరంతరం చేపట్టాలన్నారు.