VIDEO: మేడ్చల్‌లో అక్రమ కట్టడాలు కూల్చివేత
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పరిధిలోని 376, 377, 293, 202 సర్వే నెంబర్‌లలోని అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. రూపాయి రూపాయి పోగేసుకుని కట్టుకున్న ఇళ్లను కూలగొట్టొద్దని ఎంత రోదించిన పట్టించుకోలేదని బాధితులు పేర్కొన్నారు. పరిస్థితిని కట్టుదిట్టం చేసేందుకు భద్రతా దళాలు వారిని అక్కడి నుంచి లాక్కెళ్లగా.. బాధితులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.