ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

NZB: కమ్మర్ పల్లి మండలం నాగపూర్‌లో మంజీర చెరువు వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఇవాళ ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ పరిశీలించారు. కూలీల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. పని ప్రదేశంలో కల్పిస్తున్న మౌళిక వసతులపై ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఆరా తీసి, పలు సూచనలు చేశారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పనులకు హాజరు కావాలని సూచించారు.