బోనమెత్తిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

JN: పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం కడవెండిలో ఆదివారం గంగాదేవి కాటామరాజు కళ్యాణానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరు అయ్యారు. అక్కడి మహిళలతో కలిసి బోనాన్ని అలంకరించి బోనమెత్తి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు తాటిపెళ్లి మహేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.