గ్యాస్ కొరతతో ప్రజల తీవ్ర ఇబ్బందులు
ప్రకాశం: గిద్దలూరు మండలంలోని కేఎస్.పల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో గ్రామస్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు. గత కొన్ని రోజులుగా గ్యాస్ సరఫరా నిలిచిపోయిందని, గ్యాస్ కొరత సృష్టించడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి తమకు వెంటనే నిలువలను సమకూర్చాలని స్థానికులు కోరుతున్నారు.