'శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యం'
VZM: పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి యు. మాణిక్యం నాయుడు అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి, పదో తరగతి విద్యార్థులను ప్రశ్నించి వారి ప్రతిభను పరిశీలించారు. మద్యాహ్నభోజన పథకాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.