ATM దొంగల ముఠా అరెస్ట్

SKLM: సోంపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది మంగళవారం ఏటీఎం దొంగతనాలు చేసిన ముఠాను అరెస్టు చేశారు. ఎస్సై లవరాజు తెలిపిన వివరాల మేరకు జిల్లాలో పలు చోట్ల దొంగతనాలను ఒడిశాకు చెందిన ముగ్గురు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల నుంచి రూ. 5 వేలు నగదు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.