విశాఖ మ్యూజియం ఎప్పుడైనా సందర్శించారా..?
VSP: విశాఖ మ్యూజియం నగర వాసులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది. దీనిని అప్పటి CM జనార్దన్ రెడ్డి 1991లో ప్రారంభించారు. డచ్ భవనంలో ఉన్న మారిటైమ్ మ్యూజియంలోని 10 గదుల్లో నేవీ ఉపయోగించిన ఆయుధాలు, నేవీ చేసిన యుద్ధాల సమచారాన్ని కళాఖండాల రూపంలో ప్రదర్శించారు. అదేవిధంగా విశాఖ మ్యూజియం వెనుక ఉన్న రెండంతస్తుల భవనాన్నిహెరిటేజ్ మ్యూజియంగా మార్చారు.