FLASH: మరో బస్సు ప్రమాదం (VIDEO)
VKB: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్‌కోట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రాకి చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. బస్సు ముందు భాగం ధ్వంసమవగా, డ్రైవర్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.