కావలిలో భారీగా చెరువుల ఆక్రమణలు

కావలిలో భారీగా చెరువుల ఆక్రమణలు

నెల్లూరు జిల్లా కావలి మండలంలోని పెద్ద చెరువు, ముందటి చెరువు, పాపిరెడ్డి చెరువుల్లో భారీగా ఆక్రమణలు జరిగాయి. సుమారు 380 ఎకరాల శిఖం భూమి అన్యాక్రాంతమైంది. దీంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునుగుతున్నాయి. దీనిపై స్పందించిన కావలి తహసీల్దార్ పి.శ్రావణ్ కుమార్, సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగిస్తామని హామీ ఇచ్చారు.