బురదమయంగా రోడ్లు.. చిన్నారుల ఇక్కట్లు

NRML: రోడ్లు బాగా లేకపోవడంతో నిర్మల్ రూరల్ మండలంలోని డ్యాంగాపూర్ గ్రామ విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు మొత్తం బురదమయమై నడిచేందుకు వీలు లేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.