'ఇళ్లు కూలిపోయిన బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి'

NGKL: భారీ వర్షాల నేపథ్యంలో ఇళ్లు కూలిపోయిన బాధితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఎం జిల్లా నాయకులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ మండలంలోని బొందలపల్లి గ్రామంలో స్థానిక సీపీఎం నాయకులతో కలిసి మంగళవారం ఆయన పర్యటించారు. ఇళ్లు కూలిపోయిన బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు.