రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
CTR: కార్వేటి నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం బస్ స్టాప్ సమీపంలోని చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కత్తిరిపల్లి AAW వాసి కిరణ్ కుమార్ కార్వేటి నగరం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అనంతరం చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.