పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
ప్రకాశం: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో బి.వి.పేట మండలం పూసలపాడు గ్రామానికి చెందిన మోతుకూరి అలియాస్ కోలా పిచ్చయ్యకు ఒంగోలు పోక్సో కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 3 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి నేరాలను చట్టం కఠినంగా శిక్షిస్తుందని జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు తెలిపారు.