రూ.10కే డ్రెస్ అని ప్రచారం.. భారీగా వచ్చిన జనం

NZB: ఆర్మూర్ పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో ఆఫర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ దుకాణం వద్దకు జనాలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జనాలు అధికంగా తరలిరావడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సాధారణస్థితికి తెచ్చారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.