రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
VKB: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కుల్కచర్ల మండలం బండవెల్లికిచర్ల గ్రామంలోని శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి గారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వాదాలు అందించి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు, పాల్గొన్నారు.