గ్రంథాలయంలో నిరుద్యోగుల పట్టుదల

గ్రంథాలయంలో నిరుద్యోగుల పట్టుదల

GNTR: ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్న నిరుద్యోగులకు వాతావరణం కూడా అడ్డు చెప్పలేకపోతోంది. ఆదివారం మంగళగిరి గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల దృశ్యం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. కుండపోతగా కురిసిన వర్షానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, వారు తమ ప్రయత్నాన్ని ఆపలేదు. సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో సైతం తమ చదువును కొనసాగిస్తూ కనిపించారు.