ట్రాక్టర్ ఢీకొనడంతో మహిళ మృతి
కర్నూలు: పెద్దకడబూరు మండలం తారాపురంకు చెందిన సరోజమ్మ శనివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. గ్రావెల్ లోడుతో ఆదోనివైపు వెళుతున్న ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆకస్మిక మరణంతో తారాపురంలో తీవ్ర విషాదం నెలకొంది. సరోజమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.