స్టార్ డైరెక్టర్ కళ్లలో పడ్డ సారా అర్జున్?

స్టార్ డైరెక్టర్ కళ్లలో పడ్డ సారా అర్జున్?

'యుఫోరియా', 'ధురంధర్' చిత్రాలతో మెప్పించిన సారా అర్జున్‌కు బాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ రూపొందించనున్న రొమాంటిక్ లవ్ స్టోరీ 'హీర్ రంఝా'లో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందట. ఇది 'లైలా మజ్ను'కు సీక్వెల్‌గా రానుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతుండగా, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.