బైక్‌లో పాము హల్‌చల్(VIDEO)

బైక్‌లో పాము హల్‌చల్(VIDEO)

వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఒక హోటల్ వద్ద నిలిపి ఉంచిన బైక్ లోపల ఒక పాము ప్రత్యక్షమై హల్‌చల్ సృష్టించింది. అక్కడ ఉన్న కొందరు గమనించి, బైక్ సీటును తొలగించి కర్రతో శబ్దం చేయడంతో పాము బైక్ లోపలి నుంచి ఎగిరి కింద పడింది. స్థానికులు ఆ పామును కర్రతో కొట్టి చంపారు. దీంతో బైక్ యజమాని, అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.