'భారీ వర్షం, వరద ఉద్ధృతి.. గ్రామాలకు నిలిచిన రాకపోకలు'

VKB: ధారూర్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోట్‌పల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం పెరిగింది. వరద ఉద్ధృతికి నాగసమందర్ గ్రామానికి వెళ్లే రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో బుధవారం ఉదయం నుంచి నాగసమందర్, కోట్ పల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.