మాదాలవారిపాలెంలో తెరుచుకోని సచివాలయం

మాదాలవారిపాలెంలో తెరుచుకోని సచివాలయం

ప్రకాశం: పొదిలి మండలం మాదాలవారిపాలెంలో గ్రామ సచివాలయం సోమవారం 12 గంటలు దాటినా తెరవలేదు. సచివాలయం సిబ్బంది ఒక్కరంటే ఒక్కరు కూడా విధులకు రాలేదు. అనేక సమస్యలతో వచ్చిన ప్రజలు ఉదయం నుంచి సచివాలయం వద్దనే పడిగాపులు కాస్తున్నారు. సచివాలయ సిబ్బంది ఎప్పుడు వస్తారా, తమ సంస్థలు చెప్పుకుందామని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇలా తరచూ జరుగుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు.