హల్దీవాగు బ్రిడ్జిని పరిశీలించిన కలెక్టర్

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కేంద్రం నుంచి ఉప్పు లింగాపూర్ మార్గంలోని హల్దీ వాగు బ్రిడ్జిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం పరిశీలించారు. అనంతరం వెల్దుర్తి మండలం కుక్కునూరు వద్దగల పెద్దవాగు నీటి ప్రవాహాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.