పందిమడుగులో వ్యవసాయ ట్రాక్టర్ దగ్ధం
NZB: పాత కక్షల నేపథ్యంలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ ట్రాక్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. సిరికొండ మండలం పందిమడుగుకు చెందిన రవి తన పొలం వద్ద ట్రాక్టర్‌ను నిలిపి ఉంచగా, అర్ధరాత్రి సమయంలో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కక్షపూరితంగానే తన వాహనాన్ని తగలబెట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.