VIDEO: ఈసారి ఉగాదికి వేప పూత కరువే..!
SRPT: నడిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో శిలీంధ్ర వ్యాధి కారణంగా వేపచెట్లు ఎండిపోతుండడంతో ఈసారి ఉగాదికి వేప పువ్వు కొరత ఏర్పడే పరిస్థితి నెలకొంది. పచ్చగా ఉండి పూత పూయాల్సిన వేపచెట్లు ప్రస్తుతం ఎండిపోయి ఆకులు రాల్చుతున్నాయి. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ వేప చెట్లకు వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.