'ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలి'

ఆదిలాబాద్: ప్రయాణికులకు సరిపడా ఆర్టీసీ బస్సులను నడపాలని పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో భైంసా బస్టాండ్‌లో ప్రయాణికుల నుంచి సంతకాల సేకరణ చేశారు. పీవోడబ్ల్యూ నాయకులు మాట్లాడుతూ.. మహాలక్ష్మీ పథకం ద్వారా అరకొర బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేసి నడపాలన్నారు.