గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తా: మీనాక్షి

ADB: గిరిజనులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. ఆమె శుక్రవారం ఇంద్రవెల్లి మండలంలోని సమక గ్రామంలో పర్యటించారు. గిరిజనులు, ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎప్పటికి అండగా ఉంటుందన్నారు. సమస్యలు ఉంటే అధికారులతో పాటు పార్టీ నాయకులకు సూచించాలన్నారు.