రోగులకు మెరుగైన చికిత్స అందించాలి: కలెక్టర్
WNP: జిల్లాలో వర్ష ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆస్పత్రికి వచ్చే రోగులకు డెంగీ పరీక్షలు కొనసాగించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం గోపాల్పేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, అటెండెన్స్ వివరాలను తనిఖీ చేశారు.