వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎస్సై

GDWL: మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మి వెంకటేశ్వర స్వామిని పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో ఆలయంలోకి స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేశారు. ఆయన జన్మదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నామని ఎస్సై తెలిపారు.