గట్టులో పేకాట రాయుళ్లు అరెస్ట్

GDWL: గట్టు మండలం, చాగదోన శివారులోని గులగట్టు సమీపంలో ఆదివారంపేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు గట్టు ఎస్సై కేటీ మల్లేష్ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో ఉప్పల కురువ మద్దిలేటి మరియు తిమ్మప్ప పట్టుబడ్డారు. మరో ఏడుగురు వ్యక్తులు తప్పించుకుని పారిపోయారు. పోలీసులు వారి వద్ద నుంచి రూ. 5,600 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, మూడు డబ్బాల పేకాట కార్డులు పట్టుకున్నారు.