కొనసాగుతున్న పదో తరగతి మూల్యాంకనం

కొనసాగుతున్న పదో తరగతి మూల్యాంకనం

KRNL: కర్నూలులో పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం శరవేగంగా జరుగుతోందని డీఈవో శామ్యూల్ తెలిపారు. మొదటి రోజు సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రస్తుతం మూల్యాంకనంలో వేగం పెరిగిందని అన్నారు. ఇప్పటివరకు 1,44,180 పేపర్లలో 75.31 శాతం పూర్తయ్యిందని తెలిపారు. 116 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 690 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 202 మంది స్పెషల్ అసిస్టెంట్లు పని చేస్తున్నారని పేర్కొన్నారు.