'ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించాలి'
PPM: ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఆరేళ్లుగా నిర్వహించలేదని కాంగ్రెస్ నాయకులు మంగళవారం విమర్శించారు. వెంటనే సమావేశం నిర్వహించి గిరిజన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిధులు, ఉద్యోగాలు గిరిజనులకే దక్కేలా చూడాలని, పక్కదారి పట్టిన నిధులు, వెలుగు అవకతవకలపై దర్యాప్తు జరపాలని కోరారు. తాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు, వ్యవసాయం సమస్యలు పరిష్కరించాలన్నారు.