ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరికలు

NRPT: నర్వ మండలం నాగిరెడ్డిపల్లి నుంచి 10 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు ఎంపీ క్యాంప్ కార్యాలయంలో బీజేపీ పార్టీలో చేరారు. మండల అధ్యక్షులు అజిత్ రెడ్డి సమక్షంలో చేరిన యువకులకు ఎంపీ డీకే అరుణ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.