గోకవరం ప్రభుత్వాసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలు

గోకవరం ప్రభుత్వాసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలు

E.G: గోకవరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాక్టర్ ఎల్.రామలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఆమె కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.