కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
MNCL: యూనిఫామ్‌లో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌పై దాడి చేసి, పోలీసు విధులను ఆటంకం కలిగించిన ఇద్దరిని బుధవారం అరెస్ట్ చేసినట్లు బెల్లంపల్లి మండలం తాళ్ళగురిజాల SI రామకృష్ణ తెలిపారు. సెప్టెంబర్ 6న గణేష్ నిమజ్జనం ఉత్సవాల సందర్బంగా చింతకుంట్ల గణేష్, మహేష్‌లు కానిస్టేబుల్‌పై దాడి చేశారన్నారు. వారి ఇంటి దగ్గర పట్టుకొని రిమాండ్‌కి తరలించామని పేర్కొన్నారు.