గుంతల రోడ్డుపై అదుపు తప్పిన కారు

గుంతల రోడ్డుపై అదుపు తప్పిన కారు

KMR: పిట్లం నుంచి బాన్సువాడ వైపు వెళ్తున్న రహదారిపై ఆదివారం ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దిగింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ఈ రోడ్డు మరమ్మతులు మధ్యలోనే నిలిచిపోవడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిని, పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు పేర్కొన్నారు.