ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్లు అరెస్ట్

ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్లు అరెస్ట్

SKLM: జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ మహేశ్వర రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఇద్దరు అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.4.90 లక్షల విలువ గల ఏడున్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇందులో బరంపురానికి చెందిన సుజిత్‌కుమార్‌, బాలకృష్ణ సాహు పట్టుబడినట్టు తెలిపారు.