పెండింగ్ చలానాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు

GNTR: గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో 40 ఆటోలపై రూ. 40వేలు చలానాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆటో డ్రైవర్లు తమ వాహనాలపై ఉన్న చలానాలను వెంటనే ఆన్లైన్‌లో లేదా పోలీస్ స్టేషన్‌లో చెల్లించాలని సూచించారు.