లాడ్జిలో పోలీసులు విస్తృత తనిఖీలు
ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆదివారం రాత్రి పలు లాడ్జీలలో సిఐ సుభాష్, ఎస్సై వీరప్రసాద్‌లు తనిఖీలు చేపట్టారు. లాడ్జీలకు వచ్చే సందర్శకుల వివరాలను నమోదు చేసే రిజిస్టర్లను పరిశీలించారు. ప్రతి లాడ్జీలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా పని చేస్తూ ఉండాలని, వాటి రికార్డింగ్ నిరంతరం కొనసాగాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.